: కేంద్రం సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడుతుంది: డీఎస్
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. సీమాంధ్రకు మంచి ప్యాకేజీతో పాటు, రాజధాని ఏర్పాటుకు తగినన్ని నిధులు కూడా ఇస్తుందని అన్నారు. విభజన అనంతరం రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేసేలా... కేంద్రం నిర్ణయాలుంటాయని చెప్పారు.