: క్రెడిట్ కార్డు మోసగాళ్ళకు అరదండాలు
క్రెడిట్ కార్డులతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. యాక్సిస్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ గంగా ఫణీంద్ర, రమేశ్ అనే వ్యక్తులు ఖాతాదారుల వివరాలతో క్రెడిట్ కార్డులు పొంది, సొమ్మును స్వాహా చేశారని పోలీసులు తెలిపారు. యాక్సిస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులను సృష్టించి వారు ఈ విధంగా మోసాలకు పాల్పడ్డారని సీసీఎస్ కమిషనర్ ఎల్ కేవీ రంగారావు తెలిపారు. ఈ వ్యవహారంలో ఫణీంద్ర, రమేశ్ లను అరెస్టు చేయగా, మరొక వ్యక్తి పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ.8.5 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.