: నా గుండె ఆగినట్టైంది: అమితాబ్


సచిన్ టెండూల్కర్ రిటైర్ అవుతున్నాడన్న వార్త వినగానే... గుండె ఆగినట్టు అనిపించిందని 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ అన్నారు. సచిన్ క్రికెట్ కు గుడ్ బై చెబితే భారత క్రికెట్ గుండె కూడా ఆగిపోతుందని తెలిపారు. సచిన్ గురించి మాట్లాడటానికి లేదా పొగడటానికి తన వద్ద మాటలు కూడా లేవని అన్నారు. సచిన్ ఆట అమోఘం... దాంతోనే అతను మన దేశంలో అత్యంత ప్రతిభావంతుడైన వ్యక్తిగా ఎదిగాడని అమితాబ్ కొనియాడారు. సచిన్ ఉన్నప్పటి క్రికెట్ కు, లేనప్పటి క్రికెట్ కు చాలా తేడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ, ఎన్నో ఏళ్లుగా భారత్ తరపున ఆడుతూ... ప్రపంచంలో ఎవరికీ అందని ఎన్నో రికార్డులను నెలకొల్పిన సచిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని అమితాబ్ చెప్పారు.

  • Loading...

More Telugu News