: 120 మంది మత్స్యకారుల తరలింపు
ఫైలిన్ తుపాను నేపథ్యంలో మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పకు చెందిన 120 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు.
సముద్రం అల్లకల్లోలంగా మారడంతో.. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలోని ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. భారీగా ఎగసిపడుతున్న అలల కారణంగా ఇక్కడ సముద్రపు నీరు 30 అడుగుల మేర చొచ్చుకువచ్చింది.