: క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యం


తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. నిన్న ఏపీ భవన్ లో చంద్రబాబు దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అయితే, చంద్రబాబు హాస్పిటల్ లో కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. సెలైన్ ఎక్కించేందుకు డాక్టర్లు ప్రయత్నించగా చంద్రబాబు నిరాకరించారు. ప్రస్తుతం చంద్రబాబులోని కీటోన్ బాడీ స్థాయి 3 కంటే ఎక్కువగా ఉందని, దీక్ష ఇలాగే కొనసాగిస్తే కీటోన్ బాడీ ఇంకా పెరిగి కిడ్నీలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని డాక్టర్లు తెలిపారు.

  • Loading...

More Telugu News