: సెల్ ఫోన్ ద్వారా నిమిషాల్లోనే పోస్టల్ మనీ ఆర్డర్


ఎక్కడో దూర తీరాల్లో ఉన్న మీ మిత్రులు, బంధువులు మొదలైన వారికి నిమిషాల్లోనే మనీ ఆర్డర్ పంపుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయ పోస్టల్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పంపుకోవడానికి రోజుల తరబడి సమయం తీసుకుంటుందన్నది తెలిసిందే. దీంతో, సత్వరమే డబ్బులు పంపుకోవడానికి వీలుగా మొబైల్ మనీ ఆర్డర్ ట్రాన్స్ ఫర్ సేవను తపాలా శాఖ రాష్ట్రంలోని 1350 పోస్టాఫీసులలో శనివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.

సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి మొబైల్ నంబర్, ఇతర వివరాలు తెలిపి డబ్బులు చెల్లించాలి. అనంతరం పంపిస్తున్న వారితోపాటు, అటువైపు తీసుకోవాల్సిన వారి మొబైల్ ఫోన్లకు ఆరు నంబర్లతో కూడిన పిన్ కోడ్ ఎస్ఎంఎస్ వస్తుంది. పోస్టాఫీసుకు వెళ్లి ఈ కోడ్ చెబితే మనీ ఆర్డర్ మొత్తం చెల్లిస్తారు.

1,000 నుంచి 1500 రూపాయల వరకు 45 రూపాయలు సర్వీస్ చార్జీగా వసూలు చేస్తారు. ఆ తర్వాత 5,000రూపాయల్లోపు మనీ ఆర్డర్ కు 70 రూపాయలు, ఐదు వేలకుపైన 10వేల రూపాయల వరకు 112 రూపాయలు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News