: భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది: పాక్ ఆర్మీ చీఫ్


పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అష్రఫ్ పర్వేజ్ ఖయానీ భారత్ పై తన అక్కసును వెళ్లగక్కారు. పాకిస్థాన్ పై భారత్ నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. భారత్ చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలిపారు. ఇటీవల భారత్, పాక్ నియంత్రణ రేఖ వద్ద దాదాపు 40 మంది తీవ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ చొరబాటును మన భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ మాట్లాడుతూ, మన దేశంలో జరిగే ప్రతి తీవ్రవాద చర్య వెనుకా పాక్ ఆర్మీతో పాటు ఐఎస్ఐ హస్తం ఉంటుందని ఘాటుగా విమర్శించారు.

దీంతో, ప్రపంచమంతా తమ వైపు అనుమానాస్పదంగా చూస్తుండటంతో... పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ఖయానీ ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. ప్రతి తీవ్రవాద దాడికీ తమను నిందించడం తగదని అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామని తెలిపారు. ఐక్యరాజ్యసమితి చేత విచారణ జరిపిస్తే నిజాలు తెలుస్తాయని సన్నాయి నొక్కులు నొక్కడానికి ఖయానీ ప్రయత్నించారు.

  • Loading...

More Telugu News