: ఆ గేమ్స్, యాప్స్ తెలివిని పెంపొందించలేవట..
కొన్ని రకాల గేమ్స్ మెదడుకు మేతలాంటివని, వాటి వల్ల తెలివితేటలు పెరుగుతాయని భావిస్తున్నారా..? కానీ, లాభం లేదట. ఇలాంటి వాటి వల్ల విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుందే కానీ, సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం సముపార్జించడానికి, తెలివితేటలు పెరగడానికి ఇవి దోహదపడవని ఒక పరిశోధనలో తేలింది. కనుక ఐక్యూను పెంచుకోవాలంటే మరో మార్గం వెతుక్కోవాల్సిందే మరి.