: నిమ్స్ నుంచి జగన్ డిశ్చార్జ్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసినప్పటి నుంచి ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి జగన్ డిశ్చార్జ్ అవుతున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 'జై జగన్' అంటూ నినాదాలు చేశారు. జగన్ డిశ్చార్జ్ సమయంలో ఆయన భార్య వైఎస్ భారతి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని ఆయనతో ఉన్నారు. ప్రస్తుతానికి జగన్ ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే, కీటోన్స్ సాధారణ స్థితికి రావడానికి మూడు రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.