: ఫేస్ బుక్ లో ఇక మీరు దాగలేరు
ఫేస్ బుక్ లో ప్రొఫైల్ ఉండి.. ఇతరులు ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్స్ పెట్టుకున్నారా? అందరికీ మీ ప్రొఫైల్ కనిపించకూడదనే భావనలో ఉన్నారా? అయితే, మీ ఆశ అడియాశే. ఫేస్ బుక్ లో ఇకపై మీ ప్రొఫైల్ వివరాలను దాచడం కష్టం. ఈ తరహా సెట్టింగ్స్ సదుపాయాన్ని తొలగిస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. దీంతో ఎవరైనా సెర్చ్ ఆప్షన్ లో ఒకరి పేరును టైప్ చేస్తే ఆ పేరుతో ఉన్న ఫ్రొఫైల్స్ అన్నీ కనిపించేస్తాయి. 120కోట్ల మంది యూజర్లలో అతి స్వల్పంగా మాత్రమే ప్రైవసీ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని ఫేస్ బుక్ తెలిపింది. కనుక యూజర్లు పోస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.