: పరదీప్ ఓడరేవు మూసివేత.. 'ఫైలిన్' ఎఫెక్ట్
ముంచుకొస్తున్న ఫైలిన్ తుపాను నేపథ్యంలో ఒడిశాలోని పరదీప్ ఓడరేవును మూసివేశారు. పోర్టు ద్వారా జరిగే సరకు రవాణా, ఇతర కార్యకలాపాలన్నీ నిలిపివేశారు. తుపాను కారణంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని 12 ప్రధాన ఓడరేవుల్లో పరదీప్ కూడా ఒకటి.