: మరికొన్ని రోజులు దీక్ష చేసే సత్తా ఉందంటున్న చంద్రబాబు


ఢిల్లీలోని ఏపీ భవన్ లో నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబు నాయుడిని పోలీసులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయినా, బాబు ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. ఫ్లూయిడ్స్ తీసుకునేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన దీక్ష భగ్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకింకా రెండు మూడ్రోజులు దీక్ష చేసే సత్తా ఉందని ధీమాగా చెప్పారు. సీమాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికే తాను దీక్ష చేపట్టానని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News