: ఐదు జిల్లాలపై తుపాను ప్రభావం: కేంద్ర వాతావరణ శాఖ
రాష్ట్రంలోని ఐదు జిల్లాలపై 'ఫైలిన్ తుపాను' ప్రభావం ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాపై అధిక ప్రభావం ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ రాథోడ్ వెల్లడించారు. దీనివల్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా ఒడిశాలోని గంజాం జిల్లాపై ఫైలిన్ తుఫాను పెను ప్రభావం చూపనుందని వివరించారు. సముద్రంలో 2 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని, గంటకు 210 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.