: పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట
చంద్రబాబును తరలిస్తున్న అంబులెన్సును అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో, ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కాగా, బాబును ఆసుపత్రికి తరలించే నిమిత్తం ఏపీ భవన్ వద్ద మూడువేల మంది పోలీసులను మోహరించగా.. పోలీసులకు దీటుగా టీడీపీ కార్యకర్తలు కూడా వేల సంఖ్యలో అక్కడికి వచ్చారు. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది.