: పార్క్ వుడ్ పాఠశాల డైరెక్టర్ కు పదేళ్ల జైలుశిక్ష
తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో... వికారాబాద్ సమీపంలోని పార్క్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సలావుద్దీన్ అయూబ్ ను నాంపల్లి కోర్టు దోషిగా నిర్ధారించింది. విచక్షణ మరచి విద్యార్థిని జీవితాన్ని నాశనం చేసినందుకు ఆయనకు పదేళ్ల జైలుశిక్షను విధించింది.
2010 జూలైలో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థినిపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని సలావుద్దీన్ పై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఆయనపై ఐపీసీ 376, 354, 506, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మూడేళ్ల విచారణ అనంతరం నాంపల్లి కోర్టు సలావుద్దీన్ అత్యాచారానికి పాల్పడ్డాడని... నేడు ఆయనకు శిక్షను ఖరారు చేసింది.