: బాబు దీక్ష భగ్నం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దీక్ష భగ్నం చేశారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా.. వైద్యుల బృందం తనిఖీలు చేసి తక్షణం దీక్ష విరమించాలని కోరింది. అయినా, బాబు వెనుకడుగువేయలేదు. మరోవైపు, ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్.. చంద్రబాబు నాయుడు తన దీక్షా వేదికను అక్కడి నుంచి తరలించాలని రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. కమిషనర్ నోటీసులను బాబు లక్ష్యపెట్టకపోవడంతో, నేడు ఏపీ భవన్ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. దీంతో, టీడీపీ కార్యకర్తలు, నేతలు బాబు దీక్షకు మద్దతుగా పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు సోనియా గాంధీ ఫ్లెక్సీలను చించివేశారు. ఎట్టకేలకు పోలీసులు బాబు దీక్షను భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను అంబులెన్స్ ఎక్కించారు.