: తుపాను సహాయక చర్యలపై రఘువీరా ప్రకటన
పైలిన్ తుపాను ప్రమాదం ముంచుకొస్తుండడంతో ముందస్తుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో లోతట్టు ప్రాంతాలకు చెందిన 64 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు రెవెన్యూ మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులంతా తిరిగి వచ్చారని, మరికొందరు ఈ మధ్యాహ్నానికి ఒడ్డుకు చేరుకునే అవకాశముందని అన్నారు. ప్రతి మండలానికో ప్రత్యేకాధికారిని కలెక్టర్లు నియమించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.