: బాబు ఆరోగ్యం విషమం.. అంబులెన్సు సిద్ధం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్ లో సీమాంధ్రులకు న్యాయం పేరిట గత నాలుగు రోజులుగా చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీక్ష మరింత కాలం కొనసాగితే ఆయన ఆరోగ్యం ప్రమాదకర స్థాయికి పడిపోతుందని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ బాబు దీక్ష విరమించడానికి అంగీకరించలేదు. మరోవైపు బాబు దీక్షా శిబిరం వద్ద భారీగా బలగాలను మోహరిస్తున్నారు. అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. ఆయనను ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది.