: సీఎంపై నమ్మకంలేకే రాజీనామా చేశా: విశ్వరూప్
వైఎస్సార్సీపీలో చేరబోతున్న మాజీమంత్రి, ఎమ్మెల్యే విశ్వరూప్.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో సీఎంపై నమ్మకం లేనందువల్లే రాజీనామా చేశానని ఆయన అన్నారు. ఈ ఉదయం నిమ్స్ లో జగన్ ను ఆయన పరామర్శించారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తామంటున్న మంత్రులు పదవిలో కొనసాగేందుకే ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విభజనపై కేంద్రం అంగుళం కూడా వెనక్కి తగ్గటం లేదన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్సీపీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు.