ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఖరారయ్యాయి. రాష్ట్ర సర్కార్ చేపట్టిన ఈ టెండర్లను మళ్లీ ట్రాన్స్ ట్రాయ్ సంస్థకే అప్పగించాలని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీ శనివారం ముఖ్యమంత్రికి సిఫార్సు చేసింది. సీఎం కొద్దిరోజుల్లో టెండర్లను పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం తుది ప్రకటన చేస్తారు.