: ఈ విషయంలో మగవారే మిన్నట!


ఫ్యాషన్‌ను తరచుగా ఫాలో అవడంలో ఆడవారు ముందుంటారని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే పాదరక్షల విషయానికి సంబంధించి ఈ అభిప్రాయాన్ని తారుమారు చేసుకోవాల్సి ఉంటుందట. ఎందుకంటే పాదరక్షలను ఎక్కువగా కొనడానికి ఇష్టపడేది ఆడవారికన్నా మగవారేనని పరిశోధకులు చెబుతున్నారు. చెప్పులను కొనడంలో ఆడవారికన్నా మగవారు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారని పరిశోధకులు తాజా పరిశోధనలో తేల్చారు.

సాధారణంగా చెప్పుల విషయంలో ఫ్యాషన్లతో కూడిన రకాలు ఆడవారికే ఎక్కువగా తయారవుతాయి. కానీ కొనుగోలు విషయానికొస్తే మాత్రం మగవారే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారట. మన దేశంలో ఆడవారికన్నా మగవారి చెప్పులే ఎక్కువగా అమ్ముడయ్యాయని ఒక పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనలో ఏడాదికి ఆడవారి కొరకు తయారైన చెప్పులు 30 శాతం మాత్రమే అమ్ముడుకాగా, మగవారికోసం తయారైన చెప్పులు 55 శాతం అమ్ముడయ్యాయని తేలింది.

దీన్నిబట్టి చెప్పులు కొనే విషయంలో ఆడవారు మగవారికన్నా కూడా కాస్త వెనుకగా ఉన్నారని, చెప్పుల ఆకారాన్ని బట్టి కాకుండా వాటి ధరను, మన్నికనుబట్టి వారు కొంటారని, కానీ మగవారు తాము సంపాదిస్తున్నాం కాబట్టి తమకు నచ్చిన చెప్పులకోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నట్టు ఈ పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News