: ఈ పోనీ రేటెక్కువే


చూడ చక్కగా ముద్దొచ్చే గుర్రపు పిల్ల... రేటు ఎంత ఉంటుందో... అనుకుంటే ప్రపంచంలో ఇంతవరకూ ఏ గుర్రపు పిల్లకూ అంతరేటు రాలేదట. దీనికి కారణం కూడా ఉంది. ఏవిటంటే... అది దాని వంశం. దాని వంశాన్ని బట్టి దానికి రేటు పెరిగింది. అంతేమరి... చక్కటి రేసు గుర్రం వంశానికి చెందిన పిల్ల కాబట్టి అది కూడా చక్కగా రేసుల్లో ఫస్టు వచ్చేస్తుందనే ఆశతో సదరు గుర్రపు పిల్లకు రేటు ఆమాంతం పెంచేశారు కొనుగోలుదారులు.

ఐర్లాండ్‌లోని గలిలియో అనే రేసు గుర్రానికి పుట్టిన గుర్రపు పిల్లను వేలం వేయగా అది అత్యంత అధిక ధర పలికింది. ఏడాది వయసున్న ఈ గుర్రపు పిల్లను బ్రిటన్‌లోని టెట్టార్‌సాల్స్‌ అనే సంస్థ వేలం వేసింది. ఈ వేలంలో ఈ పోనీ అక్షరాలా రూ.52 కోట్ల ధర పలికిందట. ఇప్పటి వరకూ ప్రపంచంలోనే ఇంత అత్యధిక ధర పలికిన గుర్రపు పిల్ల ఇదేనని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News