: విభజనకు వ్యతిరేకంగా ఓటేసి రాజీనామా చేస్తా: మంత్రి గంటా
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఓటేసిన అనంతరం పదవికి రాజీనామా చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాహుల్ ను ప్రధానిని చేయడానికే కొందరు రాష్ట్ర విభజన అంశం తెరమీదికి తెచ్చారని అన్నారు. కేంద్రం నిర్ణయంతో సీమాంధ్రలో ప్రజలు భగ్గుమంటున్నారని ఆయన గుర్తుచేశారు. కాగా, షిండే చెప్పినట్టు అసెంబ్లీకి వచ్చేది తీర్మానమా? లేక విభజన నిర్ణయంపై నోటా? అనే దానిపై స్పష్టత లేదని పేర్కొన్నారు.