: కీలక సమావేశానికి పళ్ళంరాజు దూరం
తెలంగాణకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో పదవికి రాజీనామా చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్ళంరాజు... అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మధ్యాహ్న భోజన పథకం, ఉపాధ్యాయులకు శిక్షణ లాంటి అంశాలను సమీక్షించడానికి ఈ రోజు ఢిల్లీలో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ)ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పళ్ళంరాజు గైర్హాజరయ్యారు. దీంతో, మానవ వనరుల శాఖ సహాయ మంత్రి జతిన్ ప్రసాద సమావేశానికి అధ్యక్షత వహించారు. రాజీనామా సమర్పించిన తర్వాత పళ్ళంరాజు పలు సమావేశాలకు హాజరుకావడం లేదని సమాచారం. ఇటీవల కేంద్ర కేబినేట్ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి మాత్రం హాజరయ్యారు.