: రాష్ట్రపతి పాలనే చివరి అస్త్రం: చాకో
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించడం చివరి అస్త్రమని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 'ఆంధ్రప్రదేశ్ లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉంది, శాంతిభద్రతలు కాపాడటం దాని బాధ్యత' అని అన్నారు. శాంతి భద్రతలు అదుపులో పెట్టాలని తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన వెల్లడించారు. విధినిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనప్పుడు, ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన వస్తుందని చాకో స్పష్టం చేశారు.