: గర్ల్ ఫ్రెండ్ ప్యాంట్ కు తాళం వేసేశాడు..
వెర్రి వేయి విధాలని పెద్దలు చెప్పింది కరెక్టేనని నిరూపించాడు మెక్సికోలో 40ఏళ్ల వ్యక్తి. జకత్లాన్ లో 25 ఏళ్ల యువతి ఎంతో వేదనతో పోలీసులను ఆశ్రయించింది. 'ఏంటమ్మా..' అని ఆరాతీస్తే.. బోయ్ ఫ్రెండ్ తన ప్యాంట్ కు తాళం వేశాడని, దాంతో ప్రకృతి కార్యాలకు వెళ్లే అవకాశం లేక బాధపడుతున్నట్లు తెలిపింది. పోలీసులు వెంటనే ఆమె చెప్పిన వివరాల ఆధారంగా సదరు ఘనుణ్ణి పట్టుకొచ్చారు. అతడు ఇచ్చిన కీతో యువతి ప్యాంట్ కు ఉన్న తాళాన్ని తెరిచారు. ఇంత చేసినా, తన బోయ్ ఫ్రెండ్ పై చర్యలు తీసుకోవద్దని ఆమె కోరడంతో.. మరోసారి ఇలాంటి పనులు చేయనని అతడితో రాయించుకుని పోలీసులు వదిలేశారు.