: కర్ఫ్యూ సడలించినా తెరుచుకోని రైతుబజార్లు
విజయనగరంలో నాలుగు గంటలపాటు కర్ఫ్యూ సడలించారు. దీంతో ప్రజలు నిత్యావసరాలకోసం రోడ్లపైకి వచ్చారు. అయితే, రైతు బజార్లు తెరుచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిన్న రైతు బజారు ఎస్టేట్ అధికారి సతీష్ పై ఎఎస్పీ మోహనరావు దాడికి పాల్పడడంతో దానికి నిరసనగా రైతు బజార్లను మూసివేసి రైతులు ఆందోళనకు దిగారు. కాగా, తిరిగి ఈ ఉదయం 11 గంటలకు పోలీసులు కర్ఫ్యూ విధించారు.