: టీడీపీలో చేరతానంటున్న రాయపాటి


రాష్ట్ర విభజన ప్రకటన కాంగ్రెస్ కు శాపంగా మారింది. తెలంగాణ ఇవ్వాలని అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు హస్తం నేతలు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ కు ఎప్పుడో రాజీనామా చేశానన్న ఆయన తెలుగుదేశంలో చేరడంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈ ఉదయం చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపిన రాయపాటి అనంతరం మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

  • Loading...

More Telugu News