: హైదరాబాద్ చేరుకున్న శ్రీహరి మృత దేహం
ప్రముఖ సినీ నటుడు శ్రీహరి మృత దేహం ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఆయన భౌతిక కాయాన్ని కొద్ది సేపటి క్రితమే జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి చేర్చారు. శ్రీహరిని చివరిసారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు వెల్లువెత్తుతున్నారు. రియల్ స్టార్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తున్నారు. సాయంత్రం బాచుపల్లిలోని ఆయన ఫాంహౌస్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.