: ఈ కెమెరా సూపర్‌


శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలో ఇదొక విప్లవం. మన గుండె చప్పుడును, శ్వాసక్రియను గుర్తించే కెమెరాను శాస్త్రవేత్తలు రూపొందించారు. సంక్లిష్ట అల్గారిథమ్‌లతో కూడిన ఈ కెమెరా మన గుండె, శ్వాసక్రియా రేట్లను చక్కగా గుర్తిస్తుందట. మన ఆరోగ్యానికి సంబంధించి కీలక సంకేతాలుగా భావించే గుండె, శ్వాసక్రియా రేటును గుర్తించే విషయంలో ఒక చవకైన పద్ధతిని శాస్త్రవేత్తలు రూపొందించారు. రోగిని తాకకుండానే దీనిద్వారా రోగికి సంబంధించిన గుండె, శ్వాసక్రియా రేట్లను నిర్దిష్టంగా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సంక్లిష్ట అల్గారిథమ్‌లతో కూడిన సాధారణ వీడియో కెమెరా ద్వారా దీన్ని గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. టెలీమెడిసిన్‌ ప్రక్రియలో ఇది చాలా కీలకమైన పరిణామంగా పరిశోధకులు భావిస్తున్నారు.

గుండెపోటు, పక్షవాతం వంటివాటిని ఇంటివద్దే గుర్తించడంలో, ఆకస్మిక మరణాల వంటి సమస్యను నిర్ధారించడంలోను ఈ కెమెరా చక్కగా తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉంది? అనే విషయాన్ని ఆ వ్యక్తి గుండె, శ్వాసక్రియా రేట్లు చెబుతాయని, తాము రూపొందించిన అల్గారిథమ్‌లు వేగంగా, నిక్కచ్చిగా అంచనా వేస్తాయని జార్జియా రీజెంట్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు డాక్టర్‌ జో సియెన్‌ చెబుతున్నారు. ఈ కెమెరాతో తమ అధ్యయనంలో భాగంగా పలువురు ప్రముఖుల టీవీ దృశ్యాలను పరిశోధకులు పరీక్షించి చూశారు.

  • Loading...

More Telugu News