: శ్రీహరి మృతికి టాలీవుడ్ హీరోల దిగ్భ్రాంతి


రియల్ హీరో శ్రీహరి మృతి పట్ల సోషల్ మీడియాలో తీవ్ర సంతాపం వ్యక్తమైంది. టాలీవుడ్ సినీ హీరోలు శ్రీహరి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీ కళామతల్లికి తీరని శోకం మిగిల్చిన శ్రీహరి మంచి మనిషని, ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు ట్విట్లర్లో స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని మహేష్ బాబు తెలుపగా.. అతని ఆత్మకు శాంతి కలగాలని రాం చరణ్ అన్నారు. నాని.. అక్షర ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన సేవకు అంతులేదని అలాంటి వ్యక్తి దూరమయ్యారన్నారు. సినీ పరిశ్రమ షేర్ ఖాన్ ని కోల్పోయిందని అల్లరి నరేశ్ అన్నారు. అతని ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయామని, బాధతో మాటలు రావట్లేదని మంచు మనోజ్ చెప్పారు. అతని ఆత్మకు శాంతి కలగాలని విష్ణు అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన వ్యక్తిని కోల్పోయామని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. స్ఫూర్తిని కలిగించే తెలుగు యాక్షన్ హీరో ఇకలేరని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. షాకింగ్ న్యూస్ అని, తాను నమ్మలేకపోతున్నానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్వీట్ చేశారు. కష్టాల్లో ఉన్న ఎందరో నిర్మాతలకు సహాయం చేసిన శ్రీహరి మరి లేరని, అతని ఆత్మకు శాంతి కలగాలని నవదీప్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News