: విభజనను అడ్డుకోండి.. రాష్ట్రపతికి విజయమ్మ విజ్ఞప్తి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. ఢిల్లీలో పలువురు జాతీయ నేతలను కలసి విభజనను అడ్డుకోవాలని కోరిన విజయమ్మ మధ్యాహ్నం రాష్ట్రపతిని కలిశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాన్ని విభజించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను, జరుగుతున్న ఉద్యమాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు.