: ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.. కొన్ని రద్దు
విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా సీమాంధ్రలో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్ని రద్దయ్యాయి. బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ ప్రెస్ 8 గంటలు, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్ 5 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక భువనేశ్వర్-విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, పలాస-విశాఖ ప్యాసింజర్, రాయగడ-విశాఖ ప్యాసింజర్, విజయనగరం-విశాఖ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.