: ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం


దేశ రాజధాని ఢిల్లీలోని బారా హిందూరావ్ ప్రాంతంలో మూడంతస్తుల పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఈ ఘటనతో ఢిల్లీలో పురాతన భవనాలను కూల్చేయాలని ఢిల్లీ ప్రభుత్వం అధికారులకు సూచించింది.

  • Loading...

More Telugu News