: పళ్లు పటపటలాడిస్తూ పాటలు వినొచ్చు!
మీకు నచ్చిన పాటలను వినడానికి మీ ఫోన్లో మెమరీ కార్డు, చక్కటి హెడ్సెట్ ఉంటే చాలు. వీటితో కొందరు ఈ లోకాన్నే మరిచిపోయి పాటలను వింటూ ఉంటారు. ఇలా పాటలను వినాలకునే వారికి శాస్త్రవేత్తలు బుల్లి మ్యూజిక్ ప్లేయర్‌ను రూపొందించారు. ఎంత బుల్లిది అంటే, కేవలం ఒక చెవిలో మాత్రమే పెట్టుకునే అంత బుల్లిది. పరిమాణంలో బుల్లిదే అయినా పనిలో మాత్రం మిన్నేనంటున్నారు దీని రూపకర్తలు. పైగా దీన్ని ఆపరేట్ చేయడం కూడా సులభమేనట. దీన్ని ఆపరేట్ చేసే మీటలు మన నోట్లోని దంతాలేనట...
ఫ్లోరిడాకు చెందిన గ్రీన్వింగ్ ఆడియో సంస్థ ఈ బుల్లి మ్యూజిక్ ప్లేయర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ బుల్లి మ్యూజిక్ ప్లేయర్ చెవిలో మాత్రమే ఇమిడిపోయేంత బుల్లిది. దీన్ని మన దంతాలతోనే ఆపరేట్ చేయవచ్చు. మనకు నచ్చిన పాటను వినాలనుకుంటే దీన్ని చెవిలో పెట్టుకుని ఒక్కసారి మన పళ్లను కొరికితే చాలు. ఇది పనిచేస్తుందట. ఒక సారి పళ్లను కొరికితే పాట మారుతుంది. రెండు సార్లు కొరికితే సౌండ్ తగ్గుతుందట. అలాగే పళ్లను ఆడించడం ద్వారా పాటలను ఆపడం, లేదా ప్లే చేయడం వంటివి చేయవచ్చు. ఇలా అన్నింటినీ పళ్లతోనే నియంత్రించవచ్చట. ఒకవేళ ఏదైనా తింటూ పాటలను వినాలనుకుంటే ఎలా ఉంటుందో మరి...!!