: భారత్-బంగ్లా సరిహద్దులో భూకంపం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం ఈరోజు ఉదయం భూకంపంతో ఉలిక్కిపడింది. అసోంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 5.2 గా నమోదు కాగా, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. భూకంపాలపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం చేస్తున్న యూఎన్ జియోలాజికల్ సర్వే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భూమి కంపించినట్టు వెల్లడించింది.