: మోడీపై చిదంబరం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ


గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. ఓసారి కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిని మోడీతో పోల్చి చూసుకోండని హితవు పలికింది. ఓ ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ, వాజ్ పేయి, అద్వానీ కంటే మోడీ సమర్థుడేమీ కాదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ స్పందించారు. చిదంబరం తన వ్యాఖ్యల ద్వారా మోడీకి 'వాకోవర్' ఇచ్చినట్టయిందని ఎద్దేవా చేశారు. మోడీకి సరితూగే నేతలెవరూ కాంగ్రెస్ పార్టీలో లేరని చిదంబరం చెప్పకనే చెప్పినట్టయిందని అన్నారు. 'ఇందిరా గాంధీ కంటే తానే బెటర్ అని చిదంబరం భావిస్తే అది వేరే విషయం. అటల్జీ, అద్వానీ మా నేతలు. చిదంబరం ఏమైనా చెప్పదల్చుకుంటే, తొలుత రాహుల్ కంటే మోడీ ఎంతో ముందున్నాడన్న విషయం తెలుసుకోవాలి' అని హుస్సేన్ హితవు పలికారు.

  • Loading...

More Telugu News