: ఈ నెల 14 నుంచి ఎయిర్ కోస్తా సేవలు


ఈ నెల 14 నుంచి ఆరు నగరాలకు సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ఎయిర్ కోస్తా సంస్థ చైర్మన్ లింగమనేని రమేశ్ తెలిపారు. ప్రస్తుతం విజయవాడ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్ నగరాలకు సర్వీసులు నడపనున్నామని, త్వరలోనే విమానాల సంఖ్య పెంచి మధురై, విశాఖ, గోవా, త్రివేండ్రం, మైసూర్ తో పాటు ఇతర ముఖ్య నగరాలకు దేశీయ విమాన సర్వీసులను విస్తరిస్తామని వివరించారు. వచ్చే రెండేళ్లలో ఈ రంగంలో మరో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. తక్కువ ఖర్చుతో మంచి సదుపాయాలు అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. 2014 చివరినాటికి పది అత్యాధునిక ఇ190 జెట్ విమానాలను సమకూర్చుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News