: ఉగ్రవాదుల చొరబాటు వెనక పాక్ హస్తం: ఆర్మీ చీఫ్


జమ్మూ కాశ్మీర్ లోని కేరన్ సెక్టార్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముగిసింది. సెప్టెంబర్ 24 నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 40 మంది తీవ్రవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ కాల్పుల పర్వం నేటితో ముగిసింది. ఈ రోజుతో సమాప్తమైన ఆపరేషన్ లో ఏడుగురు ఉగ్రవాదులు మరణించారని, ఆరుగురు జవాన్లు గాయపడ్డారని ఆర్మీ చీఫ్ విక్రమ్ సింగ్ తెలిపారు. తీవ్రవాదుల చొరబాటు యత్నం వెనుక పాక్ సైన్యం సహాయ సహకారాలున్నట్టు తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆర్మీ చీఫ్ తెలిపారు. పాక్ హస్తం లేకుండా తీవ్రవాదులు ఇంత దూరం చొచ్చుకురావడం అసాధ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News