: రాష్ట్ర విభజన పిటిషన్ పై ముగిసిన వాదనలు
రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోం శాఖ కార్యదర్శులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. విభజనకు ఉద్దేశించి రాజ్యాంగంలోని 3 వ అధికరణం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రవేశికకు విరుద్ధంగా ఉందని అందుచేత దానిని కొట్టివేయాలని పిటిషనర్ పీవీ కృష్ణయ్య హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. ఇప్పటికే రాష్ట్రంలో 371(డి) అధికరణం అమలులో ఉండగా, 3 వ అధికరణకు అనుగుణంగా రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని వాదించారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసింది.