: అనకాపల్లి డీఎస్పీ సస్పెన్షన్
విశాఖ జిల్లా అనకాపల్లి డీఎస్పీ మూర్తిని జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. గత కొద్ది కాలంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారన్న బాధితుల ఫిర్యాదుపై ఎస్పీ విచారణ జరిపించారు. విచారణలో మూర్తిపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో ఎస్పీ ఆయనను సస్పెండ్ చేశారు.