: విద్యుత్ ఉద్యోగుల సమ్మె.. గగ్గోలు పెడుతున్న దక్షిణాది రాష్ట్రాలు


సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేడూ కొనసాగుతుండడంతో దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడడంతో దక్షిణాది పవర్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ముంగిట నిలిచింది. మరికొద్ది రోజులు సమ్మె కొనసాగితే తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి అంధకారంలో మునిగిపోతాయి. దీంతో, అక్కడి ప్రభుత్వాలు కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తక్షణమే రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరిపాలని కోరాయి.

  • Loading...

More Telugu News