: సొంత నియోజకవర్గంలో సోనియా పర్యటన


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా లాల్ గంజ్ లో ఏర్పాటు చేయబోయే రైలు చక్రాల తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొని పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత జల్ కల్ ప్రాంతంలో నగర వనరుల అభివృద్ధి కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని యూపీ కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News