: కేజీహెచ్ పైకెక్కిన వైద్యులు
సమైక్య రాష్ట్రం కోసం విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు ఆసుపత్రి భవనం పైకెక్కారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన చేయరాదని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సమైక్య ప్రకటన వచ్చేవరకు తాము భవనం దిగబోమని స్పష్టం చేశారు. దీంతో, పోలీసులు రంగప్రవేశం చేసి ఆ డాక్టర్లిద్దరినీ కిందకు దించారు. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.