: కల్పవృక్ష వాహనంపై శ్రీవారు.. గాయత్రీదేవిగా దుర్గాదేవి
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగారు. కోరిన కోర్కెలను తీర్చే కల్పవృక్షాన్ని తన వాహనంగా మలచుకుని కామధేనువుతో శ్రీనివాసుడు తిరు వీధులలో వూరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై తిలకించారు. అటు శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు కనువిందు చేసింది.