: మంత్రి పేరు చెప్పి నిరుద్యోగులకు టోకరా
మంత్రి పేరు చెప్పేసరికి నమ్మేసి, నిండా మునిగారు నిరుద్యోగులు. చివరికి 420 చేతిలో మోసపోయినట్లు అర్థం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఫయాజ్.. మంత్రి సుదర్శన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినని, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 18 మంది నుంచి 54 లక్షల రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.