: ఢిల్లీ వెళ్లిన వైఎస్ విజయమ్మ
వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఓ వైపు జగన్ దీక్ష చేస్తుండగా ఈ సమయంలోనే జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో కలిసి విజయమ్మ పలువురు జాతీయస్థాయి నేతలను కలవనున్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాలని, సమైక్యాంధ్ర అవసరాన్ని జాతీయ నేతలకు తెలిపి విభజనను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.