: కాసేపట్లో విద్యుత్ ఉద్యోగులతో సీఎం చర్చలు
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర జిల్లాలతో పాటు రైల్వే శాఖ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో సీఎం రంగంలోకి దిగారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కిరణ్ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో సమావేశం కానున్నారు. వెంటనే విధుల్లోకి చేరి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించమని సీఎం విద్యుత్ ఉద్యోగులను కోరనున్నట్టు సమాచారం. అయితే సీఎం విన్నపాన్ని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అంగీకరించే అవకాశంలేదని తెలుస్తోంది.