: నఖసౌందర్యాన్ని ఇలా కాపాడుకోవచ్చు
మృదువైన వేళ్లకు మకుటాల్లాంటి గోళ్లు చాలా అందాన్నిస్తాయి. కొందరికి గోళ్లు విరిగిపోతుంటాయి. పొడవుగా పెంచుకోవాలని చాలా కోరికగా ఉన్నా బలహీనమైన గోళ్లు ఎక్కువగా విరిగిపోతుంటాయి. ఇలా గోళ్లు బలహీనంగా లేకుండా బలంగా, దృఢంగా తయారవ్వాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలట... రోజూ మీ గోళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకొని చక్కగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గోళ్లలో రక్తప్రసరణ బాగా జరిగి గోళ్లు పొడవుగా, బలంగా పెరుగుతాయి.
మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంతగా నీరు తాగుతూ ఉండాలి. దీనివల్ల గోళ్లలో తేమ తగ్గి పొడిబారకుండా ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో మల్టీ విటమిన్లు, కాల్షియం బాగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడప్పుడు గోళ్లకు ఆలివ్ ఆయిల్‌ను రాయడం అలవాటు చేసుకోవాలి. నెలలో రెండు లేదా మూడుసార్లు ఆలివ్ ఆయిల్‌తో గోళ్లకు మసాజ్ చేయడం మంచిది. కొందరికి గోళ్లు కొరకడం అలవాటుగా ఉంటుంది. ఇలా గోళ్లను కొరికే అలవాటు మానుకుని, వారు రెండుసార్లు చక్కగా గోళ్లను కత్తిరించి, చక్కగా షేప్ చేసుకుంటే గోళ్లను చక్కగా కాపాడుకోవచ్చు.