: అప్రమత్తంగా ఉండాలంటున్న మంద కృష్ణ
తెలంగాణ రాష్ట్ర ప్రకటనపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. మహబూబ్ నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. 2009లో కేంద్రం ప్రకటన చేయగా, అప్పట్లో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ప్రకటన వెనక్కి వెళ్ళిపోయిందని వివరించారు. ఈసారి అలాంటి పొరబాట్లకు తావివ్వరాదని సూచించారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.